ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బైక్​ను వెనుక నుంచి ఢీకొన్న కారు.. వ్యక్తి మృతి - man dead in road accident at prakasam news update

ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలో కారు, బైక్​ను వెనుక వైపు నుంచి ఢీ కొట్టింది. ఈ ఘటనలో ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న వ్యక్తి తీవ్రంగా గాయపడగా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు.

man dead in road accident
బైక్​ను వెనుక నుంచి ఢీకొన్న కారు వ్యక్తి మృతి

By

Published : Jul 3, 2020, 9:48 PM IST


రోడ్డు దాటుతుండగా వెనుక వైపు నుంచి కారు ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలో చోటుచేసుకుంది. త్రిపురాంతకం మండలం గొల్లపల్లి సమీపంలో బాల గురవయ్యఅనే వ్యక్తి ద్విచక్ర వాహనంపైకేజీ రహదారి దాటుతుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. గుంటూరు వైపు నుంచి వేగంగా వస్తున్న కారు బైక్​ను వెనుక వైపు నుంచి ఢీ కొట్టింది. తీవ్ర రక్తస్రావమైన బాల గురవయ్యను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో ప్రాణాలు విడిచాడు.

ABOUT THE AUTHOR

...view details