కులాలను, మతాలను రెచ్చగొట్టే విధంగా, కించపరిచే విధంగా ఎవరు ప్రవర్తించినా... చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకుంటామని నరసరావుపేట డీఎస్పీ సి.విజయభాస్కరరావు హెచ్చరించారు. ఓ మతాన్ని కించపరుస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన గుంటూరు జిల్లా చిలకలూరిపేట అయోధ్య రామ జన్మభూమి ట్రస్ట్ కన్వీనర్ వెల్లంపల్లి శ్రీరాములును పోలీసులు అరెస్టు చేశారు.
ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ స్వతంత్రంగా జీవించే హక్కు ఉందన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా మెలగాలని సూచించారు. సమావేశంలో అర్బన్, రూరల్ సీఐ లు బిలాలుద్దీన్, ఎం. సుబ్బారావు, ఎస్ఐ లు రాంబాబు, షఫిలు పాల్గొన్నారు.