ఇన్ని రోజులు డాబాలు, బంగళాలకు, చివరికి పెంకుటిళ్లకు ఏసీలు పెట్టించే వారిని చూశాం. కానీ ప్రకాశం జిల్లా ఒంగోలులో బాలాజీనగర్‌కు చెందిన ఓ వ్యక్తి తడికెల గుడిసెకు హైటెక్ హంగులు అద్దాడు. అనారోగ్యంతో మంచాన ఉన్న అత్త ఎండవేడి నుండి తట్టుకునేందుకు ఏసీ సదుపాయం కలిపించి ఔరా అనిపిస్తున్నాడు. దీనికితోడు కూలర్, ఫ్యాన్‌ని సైతం ఏర్పాటు చేశాడు. గుడిసెకు ఏసీ ఏర్పాటు చేయటం చూసిన కాలనీవాసులు ముక్కున వేలేసుకుంటున్నారు. వృద్ధురాలైన అత్తపై అల్లుడు చూపిస్తున్న ఆదరణను అందరూ అభినందిస్తున్నారు.
గుడిసెకు ఏసీ.. అభిమానాన్ని చాటుకున్న అల్లుడు - VARIETY
వృద్ధురాలైన అత్తపై మమకారాన్ని చాటుకున్నాడు ఓ అల్లుడు. అనారోగ్యంతో ఉన్న అత్త.. ఎండవేడికి తట్టుకోలేకపోవటంతో తడికెల గుడిసెకు ఏసీ ఏర్పాటు చేసి.. ఆమెకు ఉపశమనం కల్పించాడు.

గుడిసెకు ఏసీ.. అభిమానాన్ని చాటుకున్న అల్లుడు
Last Updated : Jun 4, 2019, 3:25 PM IST