లాక్ డౌన్ కారణంగా ప్రకాశం జిల్లా చీరాల, పర్చూరు నియోజకవర్గాల్లో ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఆదివారం నేపథ్యంలో మాంసం దుకాణాలకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వారంతా భౌతిక దూరం పాటించే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. పేరాల రెడ్ జోన్ ఏరియాలో ప్రజల సౌకర్యార్థం పండ్లు, కూరగాయలు, మాంసం, చేపల మార్కెట్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు.
జనం భౌతిక దూరం పాటించేలా పోలీసుల చర్యలు - covid cases in prakasam dst
మాంసం దుకాణాల ముందు భౌతిక దూరం పాటించేలా ప్రకాశం జిల్లా చీరాల పోలీసులు పటిష్ఠ చర్యలు తీసుకున్నారు. పేరాల రెడ్ జోన్ ప్రాంతంలో నిత్యవసర సరుకుల దుకాణలను అందుబాటులోకి తెచ్చారు.
జనం భౌతిక దూరం పాటించేలా పోలీసుల చర్యలు