ప్రధాని మోదీ 2.0 ప్రభుత్వం, మొదటి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ప్రభుత్వ విజయాలను తెలియజెప్పేందుకు భాజపా ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ఒంగోలులో ఇంటింట ప్రచార చేపట్టారు. మహిళా మోర్చ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందరేశ్వరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2014 సంవత్సరంలో అధికారం చేపట్టిన తరువాత ప్రధాని మోదీ ఎన్నో సంస్కరణలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, 2019 రెండో సారి కూడా అధికారం చేపట్టి ఏడాది పాలన విజయవంతంగా సాగించారని కొనియాడారు.
'మోదీ పాలనలో దేశం అభివృద్ధి పథంలో నడుస్తోంది' - mahila morcha in prakasham district news
మోదీ ప్రవేశపట్టిన కార్యక్రమాలతో దేశం అభివృద్ధి పథంలో నడుస్తోందని దగ్గుబాటి పురందేశ్వరీ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కరోనా ముందస్తు నివారణ చర్యలు విషయంలో నిర్లక్ష్యం చూపిందని, ఫలితంగా ఇప్పుడు తగిన మూల్యం చెల్లించుకుంటున్నామన్నారు.
!['మోదీ పాలనలో దేశం అభివృద్ధి పథంలో నడుస్తోంది' mahila morcha chief daggubati purandhareswari](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7623901-584-7623901-1592212540524.jpg)
మహిళా మోర్చ అధ్యక్షరాలు దగ్గుబాటి పురందరేశ్వరి