ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 16, 2023, 9:17 PM IST

ETV Bharat / state

మహాశివరాత్రి వేడుకలకు ముస్తాబైన త్రిపురాంతకం

Maha Shivaratri at Tripurantaka Kshetra : ప్రసిద్ధి చెందిన త్రిపురాంతకం ఆలయంలో నేటి నుంచి మహశివరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రాంరంభం అయ్యాయి. శైవ,శాక్తేయ క్షేత్రాల్లో మహిమాన్విత క్షేత్రం త్రిపురాంతకం. ఈ ఆలయం 11వ శతాబ్దానికి చెందినదిగా ప్రతీతి. శ్రీచక్ర ఆకారంలో శివాలయం ఉండటం ఈ క్షేత్ర ప్రత్యేకత. మంత్రి ఆదిములపు సురేష్ సొంత నిధులతో నూతనంగా నిర్మించిన ముఖద్వారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Maha Shivaratri at Tripurantaka Kshetra
Maha Shivaratri at Tripurantaka Kshetra

Maha Shivaratri at Tripurantaka Kshetra : శైవ శాక్తేయ క్షేత్రాల్లో మహిమాన్విత క్షేత్రం త్రిపురాంతకం... ప్రకాశం జిల్లాలో ఉన్న ఈ క్షేత్రం శ్రీశైల మల్లన్న ఆలయానికి తూర్పు ద్వారంగా విరాజిల్లుతోంది. ఇక్కడి ఆలయం 11వ శతాబ్దానికి చెందినదిగా ప్రతీతి. శ్రీచక్ర ఆకారంలో శివాలయం ఉండటం ఈ క్షేత్ర ప్రత్యేకత. త్రిపురాసురుడు అనే రాక్షసుడిని సంహరించిన ప్రదేశం కావడంతో ఈప్రాంతానికి త్రిపుర హంతకం అని పేరు వచ్చి.. కాలక్రమేణా త్రిపురాంతకంగా మారింది. అమ్మవారి ఆలయాలను శ్రీచక్ర ఆధారితంగా నిర్మిస్తుండటం సహజం. శ్రీచక్రంపై నిర్మించిన శివుని ఆలయం త్రిపురాంతకేశ్వరుని ఆలయం ప్రపంచంలో ఒక్కటే కావడం విశేషం. మధ్య స్థానంలో స్వామి కొలువై ఉండగా మూల స్థాన పీఠంపై అమ్మవారు ఉంటారు.

ఏ ఆలయానికి వెళ్లినా తూర్పు, ఉత్తరం ద్వారాల నుంచి మాత్రమే స్వామి వారిని దర్శించుకోవాలి. కానీ త్రిపురాంతకేశ్వరుణ్ని దర్శించుకోవాలి అంటే మాత్రం.. దక్షిణ నైరుతీ ద్వారం నుంచి మాత్రమే వెళ్లాలి. ఈ ఆలయాన్ని రాక్షసులు నిర్మించారని తెలుస్తోంది. అంతటి ప్రసిద్ధి గల ఆలయంలో నేటి నుంచి మహశివరాత్రి ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. ఈ ఒక్క జిల్లా నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలిరానున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

మహశివరాత్రి పండుగ రోజున అధిక సంఖ్యలో భక్తులు రానున్న నేపధ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసారు. దూర ప్రాంతం నుంచి వచ్చేవారికి అన్ని రకాల వసతులు ఏర్పాట్లు చేశారు. అలాగే భక్తుల కోసం ప్రత్యేకంగా బస్సులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆలయానికి ప్రవేశించే కొండ మార్గాన మంత్రి ఆదిమూలపు సురేష్ రూ.31 లక్షల సొంత నిధులతో నూతనంగా నిర్మించిన ముఖద్వారాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మహాశివరాత్రి వేడుకలకు ముస్తాబైన త్రిపురాంతకం

మహాశివరాత్రి పండుగ సందర్బంగా.. అధిక సంఖ్యలో భక్తులు రానున్న నేపధ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. దూర ప్రాంతం నుంచి వచ్చే వారికి అన్ని రకాల వసతులు ఏర్పాట్లు చేసాము.. అలాగే భక్తుల కోసం ప్రత్యేకంగా బస్సలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా అధికారులను అప్రమత్తం చేయడం జరిగింది.- ఆదిమూలపు సురేష్, మంత్రి

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details