మూడు రాజధానులు వద్దు అమరావతే ముద్దు అంటూ ప్రకాశం జిల్లా మార్కాపురంలో అఖిలపక్షం నేతలు, ప్రజలు మహా ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని నాయుడు బజార్ నుంచి నాలుగు వీధుల్లో ర్యాలీ నిర్వహించి... ఆర్డీఓ కార్యాలయానికి చేరుకున్న ప్రజలు ఆర్డీఓ శేషిరెడ్డికి వినతి పత్రం అందజేశారు. అసెంబ్లీలో అమరావతికి 30 వేల ఎకరాలు అవసరమని చెప్పినవారే... ఇప్పుడు మాట మారుస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి విమర్శించారు. రాజధానిని మార్చడంలో ఎదో కుట్ర ఉందన్నారు. రాష్ట్రంలో పిచ్చి తుగ్లక్ పాలన సాగుతుందన్న ఆయన... రాజధాని మార్చాలనే ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ర్యాలీలో తెదేపా, సీపీఐ, సీపీఎం నాయకులు, కార్యకర్తలు ప్రజా సంఘాలు పాల్గొన్నాయి.
అమరావతి కోసం మార్కాపురంలో మహా ర్యాలీ - capital city amaravathi latest news updates
ప్రకాశం జిల్లా మార్కాపురంలో మూడు రాజధానులు వద్దు అమరావతే ముద్దు అంటూ మహా ర్యాలీ చేపట్టారు. రాష్ట్రంలో పిచ్చి తుగ్లక్ పాలన సాగుతుందని మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి విమర్శించారు.
![అమరావతి కోసం మార్కాపురంలో మహా ర్యాలీ అమరావతి కోసం మార్కాపురంలో మహా ర్యాలీ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5661733-584-5661733-1578656100614.jpg)
అమరావతి కోసం మార్కాపురంలో మహా ర్యాలీ
రాజధానికై మార్కాపురంలో మహా ర్యాలీ
Last Updated : Jan 10, 2020, 5:08 PM IST