వైకాపా ప్రభుత్వం దళిత పక్షపాతి అని రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కనకరావు అన్నారు. ప్రతిపక్షాలు ఎస్సీలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోవాలని హితవు పలికారు. ప్రకాశం జిల్లా చీరాలలో పోలీసుల దాడిలో మృతి చెందిన ఎస్సీ యువకుడు యెరిచర్ల కిరణ్ కుటుంబాన్ని కనకరాజు పరామర్శించారు.
కిరణ్ కుటుంబాన్ని పరామర్శించిన మాదిగ కార్పొరేషన్ చైర్మన్ - ఏపీ మాదిగ కార్పొరేషన్ చైర్మన్ లేటెస్ట్ న్యూస్
ఎస్సీల అభ్యున్నతి కోసం వైకాపా ప్రభుత్వం పని చేస్తోందని మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కనకారావు మాదిగ అన్నారు. ప్రకాశం జిల్లా చీరాలలో పోలీసుల దాడిలో మృతి చెందిన ఎస్సీ యువకుడు యెరిచర్ల కిరణ్ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ప్రభుత్వం అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు.
చీరాల మృతుడు కిరణ్ కుటుంబానికి మాదిగ కార్పొరేషన్ చైర్మన్ పరామర్శ
చీరాల ఘటన తెలిసిన వెంటనే సీఎం జగన్ స్పందించారన్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామన్న భరోసా ఇవ్వటమే కాకుండా ఆర్థిక సాయం అందించారని తెలిపారు. కిరణ్ మృతిప్తె స్పెషల్ అధికారులతో నిజనిర్ధారణ కమిటీ వేయడం జరిగిందని.. కమిటీ ఇచ్చే రిపోర్ట్ ల ఆధారంగా కిరణ్ మృతికి కారకులైన వారిపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఈ విషయంపై సోమవారం హోం మినిస్టర్ కు నివేదికను అందజేస్తామని పేర్కొన్నారు.
పై వార్తపై పూర్తి సమాచారం కోసం ఇవి క్లిక్ చేయండి -'మీ డబ్బు ఎవడికి కావాలి.... న్యాయం చేయండి చాలు'
మాస్క్ వివాదం: చీరాల ఎస్సై దాడిలో యువకుడు మృతి
TAGGED:
చీరాల మాస్కు వివాదం వార్తలు