ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లారీని ఢీ కొట్టిన మరో లారీ.. డ్రైవర్ మృతి - బొల్లాపల్లి టోల్ గేట్ లారీ ప్రమాదం వార్తలు

ప్రకాశం జిల్లా బొల్లాపల్లి టోల్ ప్లాజా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి చెందాడు. ఒక లారీ మలుపు తిప్పుతుండగా.. మరో లారీ వచ్చి ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు.

road accident
ప్రమాదం

By

Published : Feb 22, 2021, 8:28 PM IST

ప్రకాశం జిల్లా మార్టూరు మండలం బొల్లాపల్లి టోల్ ప్లాజా వద్ద జరిగిన ప్రమాదంలో.. లారీ డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు. గుంటూరు జిల్లా చిలకలూరుపేట మండలం పోతవరంకు చెందిన షేక్ సుభాని లారీ డ్రైవర్​గా పని చేస్తున్నాడు. వలపర్లలో బాడుగ కోసం బొల్లాపల్లి నుంచి వెళ్లేందుకు వచ్చాడు. టోల్ ప్లాజా వద్ద లారీ మలుపు తిప్పగా.. అదే సమయంలో రాజమండ్రి నుంచి బెంగళూరుకు టైల్స్ లోడుతో వెళ్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో ముందు లారీలో ఉన్న సుభాని కేబిన్ నుంచి ఎగిరి తాను నడుపుతున్న లారీ చక్రాల కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు.

వెంటనే స్పందించిన టోల్ ప్లాజా సిబ్బంది సుభానిని హైవే అంబులెన్సులో అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యమంలో మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి కారణమైన మరో లారీ డ్రైవర్ అరుళ్ మణిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని.. దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.

ఇదీ చదవండి:అద్దంకి కాలువలోకి దూసుకెళ్లిన వాహనం.. ఒకరు మృతి

ABOUT THE AUTHOR

...view details