ప్రకాశం జిల్లా అద్దంకి నార్కెట్పల్లి రాష్ట్రీయ రహదారిపై శాంతి నగర్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి లారీ ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు. వీరు నెల్లూరు జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మృతులు హైదరాబాద్ నుంచి తమ స్వగ్రామానికి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పంచనామాకు అద్దంకి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
అద్దంకిలో ద్విచక్ర వాహనం-లారీ ఢీ.. ఇద్దరు మృతి - lorry, bike accident in aadhanki
ద్విచక్ర వాహనం లారీ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన ఘటన ప్రకాశం జిల్లా అద్దంకిలో చోటు చేసుకుంది.

ద్విచక్ర వాహనాం, లారీ ఢి.. ఇద్దరు మృతి