కరోనా వ్యాప్తి చెందకుండా ప్రకాశం జిల్లా చీరాలలోని శ్రీ కామాక్షి కేర్ హాస్పటల్ ఎండీ తాడివలస దేవరాజు ప్రత్యేక ఫేస్ మాస్క్‌ను తయారు చేశారు. ప్రస్తుతం కరోనా కేసులు పెరగటం ఆందోళన కలిగిస్తోంది. దీనికితోడు ప్రస్తుతం ఆర్టీసీ బస్సులు నడపటంతో పాటు అన్ని రకాల వ్యాపార సముదాయాలు తెరుచుకున్నాయి.
ప్రజలు మరింత రక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఏర్పడింది. కరోనా వ్యాప్తి చెందిన విధుల్లో ఉంటున్న పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి. ఈనేపథ్యంలో మాస్కుల పాత్ర కీలకమైనది. దీనిని దృష్టిలో పెట్టుకొని దేవరాజు స్వయంగా ఈ మాస్కులు తయారు చేశారు. ఇవి పూర్తి పారదర్శకంగా ఉండటంతో పాటు కళ్ళు, ముక్కు, నోరు, చెవులకు రక్షణ కల్పిస్తాయి. దీంతో బయట తిరిగే సమయంలో ఎవరైనా తుమ్మినా, దగ్గినా వాటి తుంపర్లు ఈ మాస్క్ ధరించడంతో దరిచేరవు.