ప్రకాశం జిల్లా మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెం నియోజక వర్గాల మీదుగా వెళ్లిన తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను చూసేందుకు అభిమానులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అనంతపురంలో జేసీ ప్రభాకరరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన లోకేశ్.. తిరుగు ప్రయాణంలో జిల్లా మీదుగా వెళ్లారు. దీంతో అభిమానులు ఆయనను చూసేందుకు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చారు.
లోకేశ్‌ను చూసేందుకు భారీగా తరలివచ్చిన అభిమానులు - lokesh anantapur tour
తెదేపా నేత లోకేశ్‌ను చూసేందుకు ప్రకాశం జిల్లాలో కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున రోడ్లపైకి తరలివచ్చారు. అనంతపురంలో జేసీ ప్రభాకరరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన లోకేశ్.. తిరుగు ప్రయాణంలో జిల్లా మీదుగా వెళ్లారు. ఈ సందర్భంగా అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు.
![లోకేశ్‌ను చూసేందుకు భారీగా తరలివచ్చిన అభిమానులు లోకేశ్‌ను చూసేందుకు భారీగా తరలివచ్చిన అభిమానులు !](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7629885-1012-7629885-1592238218526.jpg)
లోకేశ్‌ను చూసేందుకు భారీగా తరలివచ్చిన అభిమానులు !
ఈ సందర్భంగా లోకేశ్ తన వాహనాన్ని ఆపి ప్రజలకు అభివాదం చేశారు. కొన్నిచోట్ల మహిళలు ఆయనకు హారతులిచ్చారు. మార్కాపురం మండలంలోని తిప్పాయిపాలెం, చింతకుంట్ల గ్రామాల మీదుగా వెళ్లే సమయంలో భారీ ఎత్తున కార్యకర్తలు ద్విచక్ర వాహనాలతో అక్కడకు చేరుకున్నారు. కరోనా నేపథ్యంలో ఆయన వాహనం దిగకుండా అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు.