ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా వ్యాప్తి నివారణకు మరోసారి సంపూర్ణ లాక్​డౌన్

కరోనా మహమ్మారితో జనజీవనం అస్తవ్యస్థమైంది. పేద, ధనిక అనే తేడా లేకుండా ఈ వైరస్ అందరికీ సోకుతూ ఆందోళన కలిగిస్తోంది. కొవిడ్ వ్యాప్తి నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా... ప్రజల నిర్లక్ష్యంతో మరింత వేగంగా విజృంభిస్తోంది. లాక్​డౌన్ విధించినప్పటితో పోలిస్తే.. సడలించిన తర్వాతే కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఫలితంగా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మళ్లీ లాక్​డౌన్‌ విధిస్తున్నారు.

lockdown-once-again-to-prevent-corona-outbreaks-in-prakasam-district
కరోనా వ్యాప్తి నివారణకు మరోసారి సంపూర్ణ లాక్​డౌన్

By

Published : Jun 24, 2020, 5:18 PM IST

ప్రకాశం జిల్లాలో లాక్​డౌన్​ వివిధ దశల్లో అమలైంది. ఆ తర్వాత ప్రభుత్వం ఇచ్చిన సడలింపులు ఇవ్వడం... రవాణా సౌకర్యాలు ప్రారంభం కావడం వల్ల వివిధ ప్రాంతాల్లో ఉన్న జిల్లావాసులు స్వస్థలాలకు తిరిగి వచ్చారు. ఫలితంగా కరోనా వ్యాప్తి అధికమైంది. జిల్లాలో ఇప్పటివరకూ 340 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఒక్క ఒంగోలులోనే 83 కేసులు వెలుగుచూడటం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలోని కొన్ని పట్టణాల్లో అధికారులు మళ్లీ లాక్​డౌన్​ విధించారు.

చీరాలలో 48, వేటపాలెంలో 16, కందుకూరులో 22, టంగుటూరులో 14, కనిగిరిలో 9, మార్కాపురంలో 10, గుడ్లూరులో12 కేసులు బయటపడ్డాయి. ఐదు రోజుల క్రితం కేవలం 175 కేసులు ఉండగా.. ప్రస్తుతం ఆ సంఖ్య రెట్టింపయ్యింది. ఇప్పటివరకూ 137 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. జిల్లా కేంద్రంలో కొవిడ్ వ్యాప్తి అధికంగా ఉండటంతో ఒంగోలు, చీరాల, మార్కాపురం పట్టణాల్లో అధికారులు మరోసారి సంపూర్ణ లాక్‌డౌన్ ప్రకటించారు. నిత్యావసరర సేవలకు మినహాయింపు ఇచ్చారు. జిల్లావ్యాప్తంగా 47 కంటైన్‌మెంట్ జోన్లు విధించారు.

అయితే గతంలో విధించిన లాక్​డౌన్​తో తీవ్రంగా నష్టపోయామని.. మరోసారి లాక్​డౌన్​తో ఇంకా నష్టపోతామని వాపోతున్నారు.

ఇదీచదవండి.

కొత్తగా 497 కరోనా కేసులు... పదివేలు దాటిన బాధితులు

ABOUT THE AUTHOR

...view details