కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో అధికారులు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఆదివారం నుంచి నాలుగు రోజుల పాటు పట్టణంలో సంపూర్ణ లాక్డౌన్ అమలు చేయనున్నట్లు స్పష్టం చేశారు. పాలు, ఔషధ దుకాణాలు మినహా అన్ని వాణిజ్య సముదాయాలు మూసివేశారు. తెల్లవారుజామున నుంచే పట్టణంలో పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ప్రజలు అనవసరంగా బయటికి రాకుండా నియంత్రణ చేస్తున్నారు. దీంతో ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారాయి.
యర్రగొండపాలెంలో సంపూర్ణ లాక్డౌన్ ! - యర్రగొండపాలెంలో సంపూర్ణ లాక్డౌన్
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో ఆదివారం నుంచి నాలుగు రోజుల పాటు సంపూర్ణ లాక్డౌన్ అమలు చేయనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. పాలు, ఔషధ దుకాణాలు మినహా అన్ని వాణిజ్య సముదాయాలు మూసివేశారు.
![యర్రగొండపాలెంలో సంపూర్ణ లాక్డౌన్ ! యర్రగొండపాలెంలో సంపూర్ణ లాక్డౌన్ !](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8265694-399-8265694-1596358904893.jpg)
యర్రగొండపాలెంలో సంపూర్ణ లాక్డౌన్ !