రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రకాశం జిల్లా చీరాలలో లాక్డౌన్ కొనసాగుతోంది. చీరాల, కుంకలమర్రుల ప్రాంతాల్లో పాజిటివ్ కేసులు వెలుగుచూడడంపై పోలీసులు, అధికారులు అప్రమత్తమయ్యారు. శ్రీరామనవమిని ప్రజలు ఇంట్లోనే చేసుకోవాలని కోరారు. మరోవైపు.. కరోనా ప్రభావంతో ఆలయాలు మూసివేసి ఉన్నాయి. కల్యాణం జరుగుతున్న చోట.. కొద్దిమందికే పరిమితం అవుతున్నాయి. సామాజిక దూరం పాటిస్తూ నామమాత్రంగా పండగను పూర్తి చేస్తున్నారు.
శ్రీరామనవమిపై కరోనా ప్రభావం.. వెలవెలబోతున్న చీరాల - lockdown effect in chirala latest updates
శ్రీరామనవమి పండుగ సందర్భంగా చలువ పందిళ్లు వేసి వడపప్పు, పానకం పంచుతూ కోలాహలంగా ఉండే చీరాల రహదార్లు.. కరోనా దెబ్బకు వెలవెలబోతున్నాయి.
![శ్రీరామనవమిపై కరోనా ప్రభావం.. వెలవెలబోతున్న చీరాల lockdown effect in chirala](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6628634-680-6628634-1585808061703.jpg)
చీరాలలో మూతబడిన రామాలయాలు
TAGGED:
lockdown effect in chirala