ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైతు కంట్లో.. లాక్‌ డౌన్‌ కారం - ప్రకాశం జిల్లాలో 1.20 లక్షల ఎకరాల్లో మిర్చి సాగు జరుగుతోంది

లాక్‌ డౌన్‌.. ప్రకాశం జిల్లాలోని మిర్చి రైతులను ఇబ్బందులకు గురి చేస్తోంది. ఈ ఏడాది జనవరిలో కురిసిన వర్షాలకు తెగుళ్లతో కొంత నష్టపోగా.. ఇప్పుడు కరోనా వల్ల పంట చేతికొచ్చినా.. సొమ్ము చేసుకోలేని పరిస్థితులు ఏర్పడ్డాయని వాపోతున్నారు. కూలీలు దొరక్క, రవాణా సదుపాయాలు లేక పంటను చేనులోనే వదిలేసుకోవాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

prakasam district
రైతు కంట్లో లాక్‌ డౌన్‌ కారం

By

Published : Apr 10, 2020, 3:02 PM IST

ప్రకాశం జిల్లాలో 1.20 లక్షల ఎకరాల్లో మిర్చి సాగు జరుగుతోంది. పంట చేతికి వచ్చింది. కానీ, అమ్ముకోలేని దుస్థితి. దీనికి పూర్తి కారణం కరోనా. రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎండకాలంలో మిర్చి పంట దిగుబడి బాగానే ఉన్న వ్యాపారం లేదని రైతులు వాపోతున్నారు.

తమ ఇబ్బందులను గుర్తించిన జిల్లా అధికారులు కొన్ని ఆంక్షలతో కూలీలతో పని చేయించుకోవటం, రవాణా వెసులుబాటు కల్పించినప్పటికీ చేతులు కాలాకా అకులు పట్టుకున్నట్లుగా ఉందని ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో నాగులప్పలపాడు, ఇంకొల్లు, పర్చూరు, అద్దంకి, దర్శి, యర్రగొండపాలెం, త్రిపురాంతకం తదితర మండలాల్లో మిర్చి సాగు ఎక్కువగా ఉంటుంది. ఈ ఏడాది దాదాపు 1.20 లక్షల ఎకరాల్లో పంట సాగైంది. దాదాపు ఐదారు కోతలు కోసి సరకును మార్కెటుకు తరలించి అమ్ముకుంటారు. సాధారణంగా మార్చి నుంచి కోతలు ప్రారంభమై ఏప్రిల్‌ నాటికి పూర్తవుతాయి. ఆ ప్రకారమే కొందరు మార్చి ఆరంభంలో తొలి కోత మొదలు పెట్టినా కాయలను పొలాల్లోనే పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

లాక్‌డౌన్‌ నేపథ్యంలో రవాణా లేమి, కూలీలు దొరక్కపోవడం లాంటి సమస్యలతో దాదాపు 40 శాతం తాలు కాయలుగా మారాయి. కొంత పంట చేలోనే రాలిపోయింది. ధర విషయానికి వస్తే గత నెలలో క్వింటా రూ.17 వేలు వరకు ఉండేది. అయితే అప్పటికి పూర్తిస్థాయిలో పంట చేతికిరాలేదు. పంటను కొందరు రైతులు ఎలాగోలా కోసినా లాక్‌ డౌన్‌, రవాణా సదుపాయలు లేక కొనేవాళ్లు ముందుకు రాక క్వింటాను వ్యాపారులు రూ.7, 8 వేలకు అడుగుతున్నారని రైతులు చెబుతున్నారు. ఒకవైపు పెట్టుబడి సొమ్ము రాకపోగా...మరోవైపు కోతలకు అయ్యే కూలీ కూడా అందని పరిస్థితి ఏర్పడిందని, ఇదే సమయంలో కూలి ధరలు పెంచేశారని, ఫలితంగా అన్ని విధాలుగా నష్టపోతున్నామంటున్నారు.

తాళ్లూరు, దర్శి, ముండ్లమూరు, దొనకొండ, యర్రగొండపాలెం మండలాల్లో పంట పొలాల్లోనే కుళ్లే పరిస్థితి ఏర్పడిందని, కోసి కళ్లాల్లో ఉన్న కాయలు కూడా శీతల గిడ్డంగులకు తరలించేందుకు ఇబ్బందులు పడుతున్నామని అక్కడి రైతులు వాపోతున్నారు.

ఇదీ చదవండి:

250 మందికి భోజనం అందజేత

ABOUT THE AUTHOR

...view details