ప్రకాశం జిల్లా కనిగిరి చుట్టుపక్క ప్రాంతాల్లో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఐదు రోజుల పాటు సంపూర్ణ లాక్డౌన్ విధించారు. దీంతో పట్టణంలోని ప్రజలు ఒక్కసారిగా దుకాణాల వద్దకు చేరుకున్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే నిత్యావసర వస్తువులు, కూరగాయలు తెచ్చుకోవడానికి అనుమతి ఉన్న కారణంగా పట్టణంలో అన్ని దుకాణాలు కిటకిటలాడాయి. సామాజిక దూరం పాటిస్తూ దుకాణాల్లో కొనుగోళ్లు చేపట్టారు.
మళ్లీ లాక్డౌన్.. కిటకిటలాడిన దుకాణాలు - కనిగిరిలో లాక్ డౌన్
ప్రకాశం జిల్లా కనిగిరిలో లాక్డౌన్ కారణంగా.. ప్రజలు కూరగాయలు, నిత్యావసర సరకులు తెచ్చుకోవడానికి దుకాణాల ముందు క్యూకట్టారు. మధ్యాహ్నం వరకు మాత్రమే సమయం ఉన్నందున దుకాణాలు కిటకిటలాడాయి.
మళ్లీ లాక్ డౌన్.. కిటకిటలాడిన దుకాణాలు
సంపూర్ణ లాక్డౌన్ అమలులో భాగంగా పోలీసులు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. పట్టణంలో నియమ నిబంధనలను అతిక్రమించి ఎవ్వరూ బయటకు రాకూడదని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: కనిగిరిలో మళ్లీ లాక్డౌన్