Lock to Village Secretariat: బిల్లులు చెల్లించలేదని ప్రకాశం జిల్లాలో ఓ గుత్తేదారు గ్రామ సచివాలయానికి తాళం వేశాడు. ప్రకాశం జిల్లా ఇండ్లచెరువు గ్రామానికి చెందిన గుత్తేదారు బాలకోటిరెడ్డి ఏడాది క్రితం పంచాయతీ రాజ్‌కు సంబంధించిన రూ.9లక్షల కాంట్రాక్ట్ పనులను పూర్తిచేసి అప్పగించారు. అయితే ఏడాదిగా చేసిన పనులకు సంబంధించిన బిల్లులను చెల్లించలేదు. అధికారుల తీరుతో విసిగిపోయిన గుత్తేదారు.. ఇండ్లచెరువు గ్రామ సచివాలయానికి తాళం వేశారు. అక్కడే బైఠాయించి నిరనస తెలిపారు. విషయం తెలుసుకున్న తహశీల్దార్ వెంకటేశ్వర్లు.. ఎంపీడీవోతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని చెప్పటంతో.. గుత్తేదారు సచివాలయానికి తాళం తీశారు.
Lock to Village Secretariat: బిల్లులు చెలించలేదని గ్రామ సచివాలయానికి తాళం..! - బిల్లులు చెలించలేదని ప్రకాశంలో గ్రామ సచివాలయానికి తాళం
Lock to village secretariat: బిల్లులు చెల్లించటం లేదని విసుగెత్తిపోయిన ఓ గుత్తేదారు.. గ్రామ సచివాలయానికి తాళం వేశాడు. ఏడాదిగా చేసిన పనులకు సంబంధించిన బిల్లులను చెల్లించకపోవటంతో ఆగ్రహానికి గురయ్యాడు. తహసీల్దార్ వచ్చి సమస్య పరిష్కరిస్తానని చెప్పటంతో.. గుత్తేదారు తిరిగి సచివాలయాన్ని తెరిచిన ఘటన.. ప్రకాశం జిల్లాలో జరిగింది.
బిల్లులు చెలించలేదని గ్రామ సచివాలయానికి తాళం