ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Lock to Secretariat: అద్దె చెల్లించలేదని.. సచివాలయానికి తాళం - ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల గ్రామ సచివాలయానికి తాళం

Lock to secretariat: అద్దె చెల్లించలేదని గ్రామ సచివాలయానికి తాళం వేసిన ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. అద్దె భవనంలో సచివాలయాన్ని నిర్వహిస్తున్నారు. కానీ కొన్ని నెలలుగా అద్దె కట్టకపోవడంతో యజమాని తాళం వేశారు.

lock to secretariat
సచివాలయానికి తాళం

By

Published : May 11, 2022, 7:34 AM IST

Lock to secretariat: అద్దె చెల్లించకపోవడంతో పెద్దదోర్నాల 4వ సచివాలయానికి భవన యజమాని మంగళవారం తాళం వేశారు. ప్రకాశం జిల్లాలో ఈ మేజర్‌ పంచాయతీ పరిధి అయినముక్కలలోని అద్దె భవనంలో సచివాలయాన్ని నిర్వహిస్తున్నారు. నెలకు రూ.5 వేల చొప్పున 14 నెలలకు సంబంధించి రూ.70 వేల అద్దె చెల్లించలేదు. కొన్ని నెలలుగా సిబ్బందిని కోరుతున్నా.. ప్రభుత్వం నుంచి బిల్లు రాలేదని చెబుతున్నారు. దీంతో గత్యంతరం లేక యజమాని మంగళవారం భవనానికి తాళం వేయడంతో సిబ్బంది రైతు భరోసా కేంద్రంలోకి వెళ్లి విధులు నిర్వర్తించారు. పంచాయతీ కార్యదర్శి రామిరెడ్డిని వివరణ కోరగా.. గతంలో కొంత అద్దె చెల్లించామని, త్వరలో మిగిలింది చెల్లిస్తామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details