లాక్డౌన్ కారణంగా ప్రకాశం జిల్లా చీరాలలో నగర వాసులు ఇళ్లకే పరిమితమవుతున్నారు. నిత్యం రద్దీగా ఉండే రైల్వేస్టేషన్ రోడ్డు, గడియార స్తంభం, పేరాల కూడలి జనసంచారం లేక వెలవెల బోతున్నాయి. ఉదయం 6 గంటల నుంచి 10 గంటలలోపే నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయాలని అధికారులు నిబంధన విధించడం వల్ల 10 దాటిన తర్వాత రహదారులు నిర్మానుష్యంగా ఉంటున్నాయి. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.
చీరాలలో లాక్డౌన్.. ఉదయం 10 తర్వాత అన్నీ బంద్ - lock down news in prakasam district
ప్రకాశం జిల్లా చీరాలలో లాక్డౌన్ కొనసాగుతోంది. కరోనా వ్యాప్తి నివారణకు ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఉదయం 10 గంటల తర్వాత రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. అనవసరంగా బయటకు వస్తే వాహనాలు సీజ్ చేస్తామని పోలీసులు హెచ్చరించారు.
![చీరాలలో లాక్డౌన్.. ఉదయం 10 తర్వాత అన్నీ బంద్ చీరాలలో కొనసాగుతున్న లాక్డౌన్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6718841-199-6718841-1586401446031.jpg)
చీరాలలో కొనసాగుతున్న లాక్డౌన్