ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పెరిగిన కరోనా కేసులు​.. పటిష్టంగా లాక్​డౌన్​ అమలు - corona status in ongole

ప్రకాశం జిల్లాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండడంపై అటు ప్రజలు, ఇటు అధికార వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కేసుల సంఖ్య అధికంగా ఉన్న ప్రాంతాలను అధికారులు రెడ్​ జోన్లుగా ప్రకటించారు. ఆయా ప్రాంతాల్లో ప్రజలెవరూ బయటకు రాకుండా పోలీసులు నిరంతరం పహారా కాస్తున్నారు. ప్రజలకు కావాల్సిన నిత్యావసరాలను వారి ఇళ్ల వద్దకే అందిస్తున్నారు.

పెరిగిన కరోనా కేసులు​.. పటిష్టంగా లాక్​డౌన్​ అమలు
పెరిగిన కరోనా కేసులు​.. పటిష్టంగా లాక్​డౌన్​ అమలు

By

Published : Apr 11, 2020, 2:52 PM IST

ప్రకాశం జిల్లాలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. ప్రత్యేకించి ఒంగోలులో పరిస్థితి దారుణంగా ఉంది. ఇస్లాంపేటలో కేసుల సంఖ్య అధికంగా ఉన్న కారణంగా.. అధికారులు ఆ ప్రాంతాన్ని రెడ్​ జోన్​గా ప్రకటించారు. ఈ పేటలోకి వెళ్లే అన్ని మార్గాలను పోలీసులు పూర్తిగా మూసేసి తమ అధీనంలోకి తీసుకున్నారు. ఇక్కడ నిత్యావసర సరకుల పంపిణీకి చర్యలు చేపట్టారు. బండ్లమిట్ట, కొండమిట్ట, ఇందిరమ్మ కాలనీ, పీర్ల మాన్యం ప్రాంతాలనూ రెడ్‌ జోన్లుగా ప్రకటించినందున ఆయా చోట్ల నుంచి ప్రజలు ఎవరూ బయటకు రాకుండా పోలీసులు పహారా కాస్తున్నారు.

రెడ్​జోన్లు పరిశీలించిన ఉన్నతాధికారులు

నగరంలో ఏర్పాటు చేసిన రెడ్‌ జోన్లు, చెక్‌పోస్టులను శిక్షణ ఐపీఎస్‌ అధికారి జగదీష్‌, ఒంగోలు డీఎస్పీ ప్రసాద్‌తోపాటు ఒకటో పట్టణ, రెండో పట్టణ, తాలూకా స్టేషన్ల ఇన్‌స్పెక్టర్లు భీమానాయక్‌, రాజేష్‌, లక్ష్మణ్‌ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. సిబ్బందికి తగు సూచనలు చేస్తున్నారు. ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌ శుక్రవారం ద్విచక్ర వాహనంపై అంజయ్య రోడ్డు, లాయర్‌ పేట, ట్రాఫిక్‌ పోలీసుస్టేషన్‌, కోర్టు సెంటర్‌, గాంధీ రోడ్డు, ట్రంకు రోడ్డు, ఇస్లాంపేట, బండ్లమిట్ట, కర్నూలురోడ్డు ప్రాంతాల్లో పర్యటించారు.

రెడ్‌ జోన్లుగా ప్రకటించిన ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని అధికారులను ఆదేశించారు. ఒకటో పట్టణ సీఐ భీమానాయక్‌ తమ పరిధిలోని అపార్టుమెంట్లను సందర్శిస్తూ కరోనా నిరోధానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను కమిటీలతో ప్రత్యేకంగా సమావేశమై తెలియజేస్తున్నారు.

ఇదీ చూడండి:

కరోనా నివారణకు.. రసాయనాల పిచికారీ

ABOUT THE AUTHOR

...view details