ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గంలో రోజురోజుకు కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో పోలీసులు పటిష్ట చర్యలు చేపడుతున్నారు. పట్టణంలోని మూడు ప్రాంతాల్లో కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల వరకే నిత్యావసరాల కొనుగోలుకు అనుమతినిస్తున్నారు. పుల్లలచెరువు, ఎన్టీఆర్ కూడలి వద్ద బందోబస్తు ఏర్పాటు చేసి.. రాకపోకలను నియంత్రిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి ఎవరూ రాకుండా నియంత్రిస్తున్నారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వారికి అవగాహన కల్పిస్తున్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటున్నారు.
కరోనా కాటు.. పలు ప్రాంతాల్లో లాక్డౌన్ పటిష్టం
కొవిడ్ మహమ్మారి ఇప్పుడు పట్టణాలను దాటి పల్లెలకు విస్తరిస్తోంది. ప్రకాశం జిల్లాలో పలు ప్రాంతాల్లో కరోనా విజృంభిస్తున్న క్రమంలో లాక్డౌన్ను అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో కొవిడ్ నిబంధనలు అతిక్రమించిన వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.
lock down in prakasam district