ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రకాశంలో పకడ్బందీగా లాక్​డౌన్ - lock down at ongole in prakasam

ప్రకాశం జిల్లాలో లాక్​డౌన్​ను పోలీసులు మరింత కఠినతరంగా అమలు పరుస్తున్నారు. ఒంగోలులో ఎక్కువ కేసులు నమోదవుతున్న కారణంగా ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. వైరస్ వ్యాప్తి చెందకుండా అధికారులు వివిధ రకాలుగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు.

lock down at prakasam district
ప్రకాశంలో పకడ్భందీగా లాక్​డౌన్

By

Published : Apr 10, 2020, 5:40 PM IST

ప్రకాశం జిల్లాలో రోజురోజుకీ కరోనా బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో జిల్లా యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. లాక్​డౌన్​ను పోలీసులు మరింత కఠినంగా అమలు చేస్తున్నారు. ఉదయం 6 నుంచి 9 గంటల వరకే నిత్యావసర సరుకులు కొనుక్కోవటానికి అధికారులకు అనుమతినిచ్చారు. ఆ తరువాత జనాలను రోడ్లపై తిరగనివ్వకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 38కేసులు నమోదవటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. వైరస్ వ్యాప్తి చెందకుండా అధికారులు వివిధ రకాలుగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే అధికారులు ప్రకటించిన 9 రెడ్​జోన్​ ప్రాంతాల్లో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి ఎలాంటి రాకపోకలకు వీలు లేకుండా చేశారు. లాక్​డౌన్​తో నిరాశ్రయులు, పేదలకు స్వచ్ఛంద సంస్థలు ఆహారాన్ని అందిస్తున్నాయి.

ABOUT THE AUTHOR

...view details