అభివృద్ధికి నోచుకోని దొనకొండ... ఇప్పటికీ మొదలుకాని ఎంఎస్‌ఎంఈ పార్క్ పనులు Donakonda MSME Park : ప్రకాశం జిల్లా దొనకొండ మండలం రామక్కపల్లిలోని 44 ఎకరాల్లో చిన్న, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుకు.. 2019 మార్చి 1న అప్పటి ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. ఏపీఐఐసీ 268 ప్లాట్లుగా చేసి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఇస్తామని చెప్పి ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానించి.. 210 ప్లాట్ల కేటాయింపులు జరిపింది. పరిశ్రమల ఏర్పాటుకు అనువుగా మౌలిక వసతుల కల్పనకు 6 కోట్ల రూపాయల నిధులు సైతం మంజూరయ్యాయి. కానీ ఇప్పటివరకు ఎలాంటి నిర్మాణాలు జరగలేదని స్థానికులు అంటున్నారు.
ఇప్పటికీ మొదలుకాని నిర్మాణ పనులు..
తమ ప్రాంతంలో ఎంఎస్‌ఎంఈ పార్క్ ఏర్పాటైతే.. పరిశ్రమలు వస్తాయని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని స్థానికులు ఆనందపడ్డారు. వెనకబడి ఉన్న తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఆశపడ్డారు. కానీ ఇప్పటివరకు ఎలాంటి నిర్మాణాలు జరగకపోవడంతో నిట్టూరుస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వం పార్క్ ఏర్పాటుపై శ్రద్ధ చూపడంలేదని ఆరోపిస్తున్నారు. ఎంఎస్‌ఎంఈ పార్క్‌ను త్వరగా ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.
ఎంఎస్‌ఎంఈ పార్కును 2019లో ప్రారంభించారు. ఇక్కడ 210 ప్లాట్లను చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు కేటాయించారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. ఇక్కడ ఏలాంటి అభివృద్ధి పనులను చేపట్టలేదు. ఫలితంగా దొనకొండలో ఇప్పటివరకు ఎంఎస్‌ఎంఈ పార్క్ నిర్మాణమే జరగలేదు - గ్రామస్థులు
ఇదీ చదవండి