ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రోడ్డు మీదే పీపీఈ కిట్లు.. భయాందోళనలో స్థానికులు!

రహదారి పక్కనే వాడి పారేసిన పీపీఈ కిట్లు కనిపించడం.. అక్కడి వారిని ఆందోళనకు గురిచేసింది. కొవిడ్ సెంటర్ సమీపంలోనే కిట్లు పడి ఉన్న తీరుకు.. అధికారుల నిర్లక్ష్యమే కారణమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

By

Published : May 7, 2021, 5:09 PM IST

Published : May 7, 2021, 5:09 PM IST

రోడ్డు మీదే వాడిపారేసిన పీపీఈ కిట్లు.. భయాందోళనలో స్థానికులు
రోడ్డు మీదే వాడిపారేసిన పీపీఈ కిట్లు.. భయాందోళనలో స్థానికులు

ప్రకాశం జిల్లా దర్శిలోని శివరాజ్​ నగర్ వద్ద ఏర్పాటు చేసిన కొవిడ్ సెంటర్​లో వైద్యులు, సిబ్బంది ధరించిన కరోనా రక్షణ కవచాలు (పీపీఈ కిట్లు).. రోడ్లపై దర్శనమిచ్చాయి. కోవిడ్ రోగులకు చికిత్స చేసిన సిబ్బంది ధరించిన ఈ కవచాలు.. ఇలా కనిపించేసరికి ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. మామూలుగా అయితే.. విధులు పూర్తయిన తర్వాత.. కరోనా పీపీఈ కిట్లను అతి జాగ్రత్త చర్యల నడుమ దూరంగా తీసుకెళ్లి తగలబెడతారు.

దర్శి కొవిడ్ సెంటర్​లో మాత్రం అందుకు భిన్నంగా జరుగుతున్న తీరు.. జనాల్లో ఆందోళనకు కారణంగా నిలుస్తోంది. వీటి కారణంగా కరోనా వ్యాప్తికి అవకాశాలు పెరుగుతాయని స్థానికులంటున్నారు. ఇప్పటికే పరిసర ప్రాంతాల్లో 200కు పైగా కోవిడ్ కేసులు నమోదైన విషయాన్ని గుర్తు చేస్తున్న స్థానిక ప్రజలు.. ఇలాంటి తీరును ఆస్పత్రి సిబ్బంది మార్చుకోవాలని కోరుతున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details