పల్లె పోరు రసవత్తరంగా మారింది. జనరల్ ఎన్నికలంతా ప్రచారాలు, సభలు లేకపోయినప్పటికీ వర్గ, కుల, బంధువుల ప్రభావాలతో ఎన్నికలు హడావుడి ప్రారంభమయ్యింది. ప్రకాశం జిల్లాలో నాలుగు విడతల్లో 1018 పంచాయతీలకు ఎన్నికలు ప్రకటించారు. తొలిత 28 పంచాయతీలు కోర్టు వివాదాలు కారణంగా ఎన్నికలు నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల చేయలేదు.. నాగులప్పలపాడు మండలం కనపర్తి, దాసరివారిపాలెం పంచాయతీ ఎన్నికలు చివరి నిమిషంలో రద్దయ్యాయి. ఈ రెండు పంచాయతీలు పునర్విభజన సక్రమంగా జరగలేదని ఒకరు కోర్టుకు వెళ్ళగా ఎన్నికలపై కోర్టు స్టే ఇచ్చింది. దీంతో నామినేషన్లు, పరిశీలనా కార్యక్రమం పూర్తైన తరువాత ఎన్నికలు నిలిపివేస్తూ జిల్లా ఎన్నికల అధికారి నిర్ణయం తీసుకున్నారు.
వర్గాల పోరు..
కారంచేడు మండలంలోని నాయుడు వారిపాలెం, పోతునవారిపాలెంలలో ఏకగ్రీవం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద తొలివిడత ప్రకటించిన 229 పంచాయతీల్లో 225 పంచాయతీలకు ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది. అధికార పక్షంలో పోటీ ఎక్కువగా ఉండటం.. ప్రతీ పంచాయతీల్లో విభిన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. వేటపాలెంలో ఎన్నికలు జరుగుతున్న ఏకైక పంచాయతీ రామన్నపేటలో వైకాపా నుంచి రెండు వర్గాల అభ్యర్థులు పోటీలో నిలుస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, ఎమ్మెల్యే కరణం బలరాం లకు చెందిన అభ్యర్థులు ఉండగా, తెదేపాకు చెందిన వ్యక్తి కూడా పోటీ చేస్తున్నారు. దీంతో ఈ పంచాయతీ ప్రతిష్టాత్మకంగా మారింది.
వేలంతో పోటీ లేదు...
తొలివిడత ఒంగోలు డివిజన్‌లో ఉన్న 14 మండలాల్లో 229 పంచాయతీలకు ఎన్నికలు ప్రకటించారు. నాగులప్పలపాడు మండలం కొత్తకోటలో స్థానం ఏకగ్రీవం కానుంది. గ్రామాభివృద్ధికి 15 లక్షల రూపాయలు విరాళం ఇస్తామని ప్రకటించటంతో మిగతావారు పోటీకి దిగలేదు. ఒంగోలు మండలం బొద్దులూరివారి పాలెంలో వైకాపా, తెదేపా నాయకులు సమన్వయంతో ఏకగ్రీవానికి సిద్దమవుతున్నారు. లాటరీ పద్దతిపై పదవీ కాలాన్ని చెరో రెండున్నర సంవత్సరాలు సర్ధుకున్నారు. నాగులుప్పలపాడు మండలం కనపర్తి, దాసరిపాలెం పంచాయతీలు నామినేషన్లు ప్రక్రియ పూర్తయిన తరువాత ఎన్నికలు నిలిచిపోయాయి.
పరస్పర ఆరోపణలు..