ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రకాశం జిల్లా పురపోరులో జోరుగా పార్టీల ప్రచారం - prakasam district latest news

ప్రకాశం జిల్లాలో పురపోరుకు ప్రచారాల సమయం దగ్గర పడుతున్న కొద్దీ అభ్యర్థుల ప్రచారం జోరందుకుంది. ఇంటింటి ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు.

local body  election campaign in prakasam district
ప్రకాశం:పురపోరులో జోరుగా పార్టీల ప్రచారం

By

Published : Mar 7, 2021, 7:42 PM IST

ప్రకాశం జిల్లాలో పురపోరులో ప్రచారం జోరుగా సాగుతోంది. ఒక్కరోజే గడువు ఉండటంతో అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు.

చీరాలలో..

చీరాలలో 17వ వార్డులో తెదేపా అభ్యర్థి జడ్డు శ్రీహరి తనను గెలిపించాలని జోరుగా ప్రచారం చేశారు. తనను గెలిపిస్తే వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని తెదేపా అభ్యర్థులు చెబుతున్నారు. తమను గెలిపిస్తే ప్రజలకు నవరత్నాలు సక్రమంగా అందేట్లు చూస్తామని వైకాపా అభ్యర్థి చీమకుర్తి బాలకృష్ణ ప్రచారం చేశారు

చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి వైకాపా అభ్యర్థులను గెలిపించాలని ప్రకారం నిర్వహించారు.. అభ్యర్థులతో కలసి కరణం బలరాం పాపరాజుతోట, స్వర్ణ రోడ్డులో భారీ ర్యాలీ నిర్వహించారు.

అద్దంకిలో..

అద్దంకి పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 12వ వార్డులో భాజపా నాయకురాలు సాధినేని యామిని ప్రచారం నిర్వహించారు. గోపూజతో ప్రచారం ప్రారంభించి.. ఇంటింటి ప్రచారం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో భాజపా తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులను గెలిపిస్తే స్థానికంగా ఉన్న త్రాగునీరు డ్రైనేజీ వంటి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు.

ఇదీ చదవండి

జోరుగా సాగుతున్న పుర ఎన్నికల ప్రచారం

ABOUT THE AUTHOR

...view details