ప్రకాశంజిల్లా మార్కాపురం నియోజకవర్గంలోని పొదిలిలో స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మార్కాపురం అడ్డరోడ్డు వద్ద అక్రమంగా తరలిస్తున్న 48 మద్యం సీసాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తాళ్లూరు మండలానికి చెందిన దారా సాంబిరెడ్డి జోగులాంబ గద్వాల్ జిల్లా నుంచి మద్యాన్ని తీసుకొస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కారులో అక్రమంగా వీటిని తరలిస్తున్నట్లు ఎస్ఈబీ అధికారి వెంకట్రావు తెలిపారు. సాంబిరెడ్డిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.
పొదిలిలో తెలంగాణ మద్యం స్వాధీనం - తెలంగాణ నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యం స్వాధీనం
మార్కాపురం నియోజకవర్గంలో స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో తెలంగాణ నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యం సీసాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
![పొదిలిలో తెలంగాణ మద్యం స్వాధీనం పొదిలిలో తెలంగాణ మద్యం స్వాధీనం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7633677-577-7633677-1592277366978.jpg)
పొదిలిలో తెలంగాణ మద్యం స్వాధీనం