పక్క రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యాన్ని తీసుకొస్తున్న ముగ్గురు వ్యక్తులను చీరాల సెబ్ అధికారులు అరెస్ట్ చేశారు. స్వర్ణ-దండుబాట రహదారిలో మద్యం సీసాలు అక్రమంగా తరలిస్తున్నట్టు వచ్చిన సమాచారం మేరకు.. పోలీసులు వాహనాలు తనిఖీలు చేపట్టారు. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి 517 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. స్వర్ణపాలేనికి చెందిన దావీదు, ఇంకొల్లు మండలం భీమవరానికి చెందిన పాటిబండ్ల గోపాలస్వామి, గొల్లపాలెంకు చెందిన సి.హెచ్. గోపీచంద్‌ను అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. మరో ఇద్దరు నిందితులు వాసుదేవరావు, ధనుజయరాజులు పరారీలో ఉన్నారని.. వారిని కూడా త్వరలో పట్టుకుంటామని ఎక్సైజ్ పోలీసులు తెలిపారు.
మద్యం అక్రమ రవాణా.. ముగ్గురు అరెస్టు - today liquor illegal latest news update
ప్రకాశం జిల్లాలో అక్రమంగా మద్యం రవాణా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను ఎస్ఈబీ అధికారులు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. వారి నుంచి 517 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.

liquor sized
ఇందులో దావీదు వృత్తి రీత్యా ఇతర రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు అక్కడినుంచి మద్యం తెచ్చి.. స్థానికంగా ఉన్న ముఠా సభ్యులతో కలిసి విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో తేలిందన్నారు. దాడుల్లో ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ అరుణ కుమారి, ఎస్ఐలు రమేష్ ప్రతాప్, సిబ్బంది పాల్గొన్నారు.
ఇవీ చూడండి…