రాష్ట్ర ప్రభుత్వం మద్యం ధరలు తగ్గించడంతో మందుబాబులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆకాశన్నంటే ధరల కారణంగా మద్యం ప్రియులు అనేక ఇబ్బందులు పడ్డారు. మద్యం ధరలు అందుబాటులోకి తేవడంతో పాటు, అమ్మకాలు పెంచుకోవడంపై దృష్టి పెట్టిన ప్రభుత్వం.. ధరలు తగ్గిస్తూ తీసుకున్న చర్యలతో మందుబాబుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఆదివారం ప్రకాశం జిల్లా సింగరాయకొండలో మద్యం ప్రియులు ఆనందోత్సాహాలతో ప్రభుత్వ మద్యం దుకాణం వద్ద పూజలు నిర్వహించారు. మద్యం దుకాణానికి హారతులు ఇచ్చి.. అహో.. ఓహో అంటూ పాటలు పాడారు. ఇది చూసి స్థానికులు నవ్వుకున్నప్పటికీ .. మద్యం ప్రియులు మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ పలుకుతూ ధన్యవాదాలు తెలిపారు.
liquor cost decrease: మందు బాబులు ఖుష్.. మద్యం దుకాణం ముందు పూజలు - ap latest news
రాష్ట్ర ప్రభుత్వం మద్యం ధరలు తగ్గించడంతో మందుబాబుల ఆనందానికి అవధుల్లేకుండా పొయాయి. ఆదివారం ప్రకాశం జిల్లా సింగరాయకొండలో మద్యం దుకాణం వద్ద పూజలు నిర్వహించారు.
liquor cost decrease
Last Updated : Dec 20, 2021, 10:00 AM IST