ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

LIQUOR DESTROYED: అప్పుడు పట్టుకున్నారు... ఇప్పుడు ధ్వంసం చేశారు

ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా తరలిస్తూ ప్రకాశం జిల్లాలో నిర్వహించిన తనిఖీల్లో పట్టుబడిన మద్యాన్ని అధికారులు ధ్వంసం చేశారు. పబ్లిగ్గా మద్యాన్ని ఉంచి రోడ్డు రోలర్​తో తొక్కించి ధ్వంసం చేశారు. ఆ మద్యం విలువ సుమారు రెండు కోట్లు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.

LIQUOR DESTROYED
LIQUOR DESTROYED

By

Published : Jun 15, 2022, 6:11 PM IST

ప్రకాశం జిల్లా ఒంగోలులో 2 కోట్ల రూపాయల విలువచేసే మద్యాన్ని స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో అధికారులు ధ్వంసం చేశారు. 2019 నుంచి ఇప్పటివరకూ జిల్లాలో అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన మద్యం సీసాలను ఓ చోట ఉంచారు. అనంతరం వాటన్నింటినీ రోడ్డు రోలర్‌తో తొక్కించారు. ఈ మద్యం గోవా, తెలంగాణ, మహారాష్ట్ర.. ఇతర రాష్ట్రాలకు చెందిందన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా ఎస్పీ మలికా గార్గ్‌ పాల్గొన్నారు. మద్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నామని ఆమె చెప్పారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేదిలేదన్నారు.

అప్పుడు పట్టుకున్నారు... ఇప్పుడు ధ్వంసం చేశారు

ఇదీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details