తేలికపాటి వర్షం... మిర్చి రైతుల ఆందోళన - lockdown
లాక్ డౌన్ కారణంగా మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పంటకు సరైన ధర లేదని వాపోతున్నారు. దాంతోపాటు తేలికపాటి వర్షపు జల్లులు కురవటంతో మిర్చి రైతుల్లో ఆందోళన మొదలైంది.

తేలికపాటి వర్షం... మిర్చి రైతుల ఆందోళన
ప్రకాశం జిల్లా పర్చూరులో తేలికపాటి వర్షంతో మిర్చి రైతుల్లో ఆందోళన మొదలైంది. లాక్డౌన్ కారణంగా పంట అమ్ముకునే అవకాశం లేకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట మొత్తం పోలంలోనే ఉండిపోయిదని ఆన్నదాతలు వాపోతున్నారు. వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా నూతలపాడులో రైతులు ఆందోళన చెందుతున్నారు. మిరపకాయలపై పట్టలు కప్పి జాగ్రత్తలు పడుతున్నారు.