ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రామకూరు సమీపంలో చిరుత సంచారం - జె పంగలూరు మండలంలో చిరుతపులి సంచారం

ప్రకాశం జిల్లా అద్దంకి, జె పంగలూరు మండలాల్లో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. ఎన్నెస్పీ కాలువకు సమీపంలో చిరుత కనిపించడంతో ..అటుగా ప్రయాణిస్తున్నవారు పరుగులుతీశారు.

leopard at  Ramakuru
రామకూరు సమీపంలో చిరుత సంచారం

By

Published : Mar 31, 2021, 12:20 PM IST

అద్దంకి, జె.పంగులూరు మండలాల్లోని గ్రామాల్లో చిరుత పులి సంచారం అలజడి రేపింది. మంగళవారం ఉదయం రామకూరు సమీపంలో రైతులు తమ పొలాల్లో ఉండగా.. వారికి అటుగా వెళ్తున్న చిరుతపులి కనిపించింది. దానిని గమనించిన రైతులు సమీపంలోని ఎన్నెస్పీ కాలువ కట్ట వద్దకు పరుగులు తీశారు. ఈ విషయాన్ని గ్రామ వీఆర్వో చిన్నఅంజయ్యకు తెలిపారు. వీఆర్వో.. అటవీ శాఖ అధికారి ఆంజనేయులుతో కలిసి అక్కడికి చేరుకుని.. చిరుత పులి అడుగులను గుర్తించారు.

చిరుతను బంధించేందుకు బుట్టలు, వలలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. గతంలో మార్టూరు మండలం కోలలపూడి కొండ, అద్దంకి మండలం జార్లపాలెం, కశ్యాపురం ప్రాంతాల్లో చిరుత పులి సంచారం కనిపించింది. సమాచారం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు ఆయా ప్రాంతాలను అప్పట్లో పరిశీలించి వెళ్లారు. ఏడాది తర్వాత మరల చిరుత సంచారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

ఇదీ చూడండి.ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తండ్రి ఉరేసుకుని ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details