ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కాలువకు గండి.. సాగునీరు వృథా - konam reservoir leaked

విశాఖ జిల్లా కోనాం మధ్యతరహా జలాశయం పరిధిలోని ఎగువ కాలువకు స్వల్పంగా గండి పడింది. దీంతో సాగునీరు వృథాగా పోతుంది. స్థానిక రైతులు అదుపు చేయడానికి ప్రయత్నించినా అదుపులోకి రాలేదు.

కాలువకు గండి.. సాగునీరు వృథా
కాలువకు గండి.. సాగునీరు వృథా

By

Published : Aug 3, 2020, 10:30 PM IST




విశాఖ జిల్లా చీడికాడ మండలం కోనాం జలాశయానికి చెందిన ఎగువ కాలువకు స్వల్పంగా గండి పడింది. జలాశయం నుంచి ఆదివారం పొలాలకు సాగునీటిని విడుదల చేశారు. కాలువ నిర్వహణ అధికారులు ముందుగా పరిశీలించకపోవడంతో మంచాల గ్రామ సమీపంలోని కశిరెడ్డి వారి కళ్లాల వద్ద కాలువకు స్వల్పంగా గండి పడింది. నీరంతా సమీప పొలాల్లోకి వృథాగా పోతుంది. స్థానిక రైతులు అదుపు చేయడానికి ప్రయత్నించినా అదుపులోకి రాలేదు. అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.

కాలువకు గండి.. సాగునీరు వృథా

ABOUT THE AUTHOR

...view details