ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గురుకుల పాఠశాలల్లో లీడ్ ఇండియా ట్వంటీ...20 - SOCIAL AWARENESS

సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలల్లోని విద్యార్థులకు లీడ్ ఇండియ కార్యక్రమం పేరిట 5 రోజులపాటు శిక్షణ ఇస్తున్నారు.

లీడ్ ఇండియా ట్వంటీ...20

By

Published : Feb 5, 2019, 6:56 AM IST

LEAD INDIA TWINTY...20
మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలామ్‌ కలల నుంచి ఉధ్భవించిన కార్యక్రమం- లీడ్‌ ఇండియా. టీనేజర్లపై దృష్టి పెట్టాలనే ఉద్దేశ్యంతో రాష్ట్రంలోని పలు పాఠశాలల్లో ఈ కార్యక్రామాన్ని చేపడుతున్నారు. అందులో భాగంగా సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో విద్యార్థులను ఎంపిక చేసి 5 రోజులపాటు శిక్షణ ఇస్తున్నారు. ప్రకాశం జిల్లా దర్శి జిఎమ్సీ బాలయోగి గురుకుల పాఠశాలలో ప్రకాశం , గుంటూరు, నెల్లూరు జిల్లాలకు చెందిన 153 మంది విద్యార్థులను లీడ్‌ ఇండియా శిక్షణ కార్యక్రమం ఇస్తున్నారు. లక్ష్యాలు ఎలా నిర్ణయించుకోవాలి. మంచి వ్యక్తిత్వం ఎలా పెంపొందించుకోవాలి? క్రమశిక్షణ , సామాజిక బాధ్యత కలిగి ఉండటం వంటి అనేక విషయాలపై లీడ్‌ ఇండియా కార్యక్రమ నిర్వాహకులు అవగాహన కల్పిస్తున్నారు.
ప్రతి పాఠశాల నుంచి 9 మంది విద్యార్థులు ఈ శిక్షణ తీసుకుంటున్నారు. అలా నేర్చుకున్న విద్యార్థులు, వారి పాఠశాలల్లో మిగతా విద్యార్థులు నేర్పిస్తారు. అబ్దుల్‌ కలామ్ , ఆయన స్నేహితుడు ఆచార్య 2004లో స్థాపించిన లీడ్‌ ఇండియా కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో మార్పునకు కృషిచేస్తున్నారు. ఈ శిక్షణతో తమలో విశేషమైన మార్పు వచ్చిందని, తమకు ఒక లక్ష్యం ఏర్పడిందని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
విద్యార్థుల్లో మానవతా విలువలు, లక్ష్యాలు సాధనకు లీడ్‌ ఇండియా చేస్తున్న కార్యక్రమం మంచి ఫలితాలు ఇస్తుందంటున్నారు నిర్వాహకులు.

ABOUT THE AUTHOR

...view details