ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అతిగా మద్యం తాగడం వల్లే లక్ష్మణ్ ఆత్మహత్యాయత్నం - AP Latest News

CI Rajesh Kumar: బెస్తవారిపేట పోలీస్ స్టేషన్​లో గురువారం రాత్రి లక్ష్మణ్ అనే వ్యక్తి ఆత్మహత్యకు యత్నించిన ఘటనపై కంభం సర్కిల్ సీఐ రాజేష్ కుమార్ వివరణ ఇచ్చారు. అతిగా మద్యం తాగడం వల్లే లక్ష్మణ్ ఆత్మహత్యకు యత్నించాడని సీఐ వెల్లడించారు.

ci rajesh kumar
సీఐ రాజేష్ కుమార్

By

Published : Nov 4, 2022, 8:16 PM IST

CI Rajesh Kumar: బెస్తవారిపేట పోలీస్ స్టేషన్​లో గురువారం రాత్రి లక్ష్మణ్ అనే వ్యక్తి ఆత్మహత్యకు యత్నించిన ఘటనపై కంభం సర్కిల్ సీఐ రాజేష్ కుమార్ వివరణ ఇచ్చారు. గురువారం మూడు గంటల సమయంలో బెస్తవారిపేట పోలీస్ స్టేషన్​కు వచ్చిన లక్ష్మణ్ అప్పటికే మద్యం తాగి ఉన్నాడన్నారు. లక్ష్మణ్ హైవేలో వెళ్తుండగా ఆటో వాళ్లు తనపై దాడి చేశారంటూ ఫిర్యాదు చేశాడని.. ఫిర్యాదు స్వీకరించిన రైటర్ అబ్దుల్ సలీం కేసు నమోదు చేశారని.. ఆటో వాళ్లు కడప జిల్లా కలసపాడు మండలానికి చెందిన వ్యక్తులుగా గుర్తించామని.. రేపు వారిని పిలిపిస్తామని.. రైటర్ లక్ష్మణ్ చెప్పారని సీఐ వెల్లడించారు.

ఎస్సై మాధవరావు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమనికి డ్యూటీపై వెళ్లారని, ఎస్సై రావడానికి కొంత సమయం పడుతుందని రైటర్ లక్ష్మణ్ తెలిపినట్లు.. సీఐ రాజేష్ కుమార్ అన్నారు. బయటకు వెళ్లిన లక్ష్మణ్ మరోమారు మద్యం తాగి స్టేషన్​కు వచ్చి తన కేసు విషయం ఏం చేశారని ప్రశ్నించి పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నట్లు తెలిపారు.

రైటర్ అబ్దుల్ సలీం అతనిని కాపాడే ప్రయత్నంలో గాయాల పాలయ్యాడని.. రైటర్ అబ్దుల్ సలీంను కంభం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని, తీవ్రంగా గాయపడ్డ లక్ష్మణ్​ను వైద్యం కోసం ఒంగోలు రిమ్స్​ హాస్పిటల్​కు తరలించినట్లు తెలిపారు. లక్ష్మణ్ అతిగా మద్యం తాగడం వల్లే ఈ సంఘటన జరిగిందని సీఐ రాజేష్ కుమార్ చెప్పారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details