రోడ్డు ప్రమాదంలో 2 కాళ్లు కోల్పోయిన కబడ్డీ క్రీడాకారిణి అఖిలప్రియకు ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని కోరుతూ సోమవారం ప్రకాశం జిల్లా పెదగంజాంలో దీక్ష చేయనున్నట్లు న్యాయవాది శ్రవణ్ కుమార్ తెలిపారు. జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్న అఖిలకు అధికారుల నిర్లక్ష్య వైఖరి వల్లే కాల్లు కోల్పోయాయని ఆయన ఆరోపించారు.
దళిత క్రీడాకారిణి పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆమెకు ఉద్యోగం, ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని ఆయన తెలిపారు.