ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం దరిమడుగు సమీపంలో కోళ్ల లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి పొదిలికి కోళ్ల లోడుతో వెళుతున్న లారీకి.. దరిమడుగు వద్దకు రాగానే ద్విచక్ర వాహనం అడ్డు వచ్చింది. డ్రైవర్ బ్రేక్ వేశాడు. అదుపు తప్పి లారీ బోల్తా పడింది. లారీలో ఉన్న కోళ్లు సుమారు వంద వరకు కోళ్లు మృత్యువాత పడ్డాయి. గాయపడిన వారిని మార్కాపురం ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు.
కోళ్ల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా - దరిమడుగులో కోళ్ల లారీ బోల్తా
కోళ్ల లోడుతో వెళ్తున్న ఓ లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటన ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం దరిమడుగు సమీపంలో జరిగింది.

కోళ్ల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా