యువకుడి కడుపులో ఉన్న అతిపెద్ద కణితిని తొలగించి రికార్డు స్పష్టించాడు ప్రకాశం జిల్లా వైద్యుడు. ప్రకాశం జిల్లాకు చెందిన ఓ యువకుడు గతేడాది మార్చిలో తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతూ ఒంగోలులోని రమేష్ సంఘమిత్ర ఆసుపత్రిలో చేరారు. సర్జికల్ గ్యాస్ట్రో ఏంట్రాలజినస్ట్ వైద్యుడు కార్తీక్ బాబు యువకుడ్ని పరీక్షించారు. కడుపులో కణితి ఉందని గుర్తించి... శస్త్ర చికిత్స చేసి తొలగించారు. ఇది ప్రపంచంలో... అతిపెద్ద చిన్నపేగు కణితి అని వైద్యుడు కార్తీక్ తెలిపారు. ఇంత పెద్ద కణితిని తొలగించినందుకు లిమ్కా బుక్‌లో తాజాగా చోటు దక్కిందని ఆయన పేర్కొన్నారు.
ఇదీ చదవండి
అతిపెద్ద కణితిని తొలగించిన 'ప్రకాశం' వైద్యుడు - రమేష్ సంఘమిత్ర ఆసుపత్రి వార్తలు
ప్రపంచంలో అతిపెద్ద కణితిని తొలగించారు ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన ఓ ప్రైవేట్ ఆసుపత్రి వైద్యుడు. లిమ్కా బుక్‌లోనూ చోటు దక్కించుకున్నారు. కడుపు నొప్పితో బాధపడుతున్న యువకుడి ప్రాణాలను కాపాడారు.

largest small intestinal tumour removed by a doctor in prakasam district
మీడియాతో వైద్యుడు కార్తీక్