ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తప్పుల తడకలతో భూ రికార్డులు-రైతన్నల అవస్థలు - తప్పుల తడకలతో భూ రికార్డులు

ఒక పక్క రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం...మరోపక్క సాంకేతిక సమస్యలు రైతుల పాలిట శాపంగా మారాయి. తప్పుల తడకలతో ఉన్న భూ రికార్డులను సరిచేయించుకునేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. పొలానికి హక్కుదారులుగా ఉన్నా...... రికార్డుల పరంగా ఆధారాలు లేక పొలాల క్రయ విక్రయాలకు, రుణాలు పొందేందుకు అనర్హులవుతున్నారు.

farmers

By

Published : Aug 31, 2019, 9:16 AM IST

తప్పుల తడకలతో భూ రికార్డులు-రైతన్నల అవస్థలు

ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం వినోదరాయుని పాలెంకు చెందిన రైతు రత్తయ్య...మండల రెవెన్యూ కార్యాలయం సమీపంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యమే అతడిని బలిగొందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.సాగులో నష్టాలు వచ్చి అప్పులపాలైన రత్తయ్య.....రుణాల నుంచి విముక్తి పొందేందుకు తన పొలాన్ని విక్రయించాలనుకున్నాడు.పొలం అమ్మాలంటే.........పట్టాదారు పాస్‌ పుస్తకాలు,అడంగులు అన్నీ తన పేరు మీద ఉండాలి.కానీ రెవెన్యూ కార్యాలయంలో రైతు పేరు మీద ఆధారాలు లేవు.అపరిచిత వ్యక్తుల పేర్లున్నాయి.వాటిని తొలగించి ఈ రైతు పేరు మీద అడంగులు మార్చాలి.ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి.

ఈ చిన్న పని కోసం మండల రెవెన్యూ అధికారి వద్దకు,వీఆర్‌వో వద్దకు కాళ్లరిగేలా తిరిగాడు.కొంతమంది పెద్ద మనుషులతో కూడా చెప్పించాడు.కాసులు కూడా చెల్లించుకున్నాడు.కానీ పని కాలేదు.విసుగు చెందిన రైతు రత్తయ్య కార్యాలయ ఆవరణలోనే ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబీకులు చెబుతున్నారు.ఇది ఈ ఒక్క రైతు సమస్య కాదు...కనపర్తి రెవెన్యూ గ్రామ పరిధిలో ఉన్న రైతులందరి పరిస్థితి.

గతంలో జరిగిన భూ అక్రమాల క్రమంలో...రికార్డులన్నీ అస్తవ్యస్తంగా మారాయి.వినోదరాయునిపాలెం,కనపర్తికి చెందిన సుమారు10వేల ఎకరాలు వివాదంలో చిక్కుకున్నాయి. 2009లో జెన్‌ కో కోసం రైతుల నుంచి భూసేకరణ చేపట్టారు.భూ క్రయవిక్రయాలపై అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిషేధం విధించింది.ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం రావడంతో ప్రభుత్వం కాస్త వెనుక్కి తగ్గింది.అనంతరం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక......ఆ ఉత్తర్వులు రద్దు చేసి రిజిస్ట్రేషన్లకు అనుమతిచ్చింది.అయితే అధికారులు మాత్రం సమస్య పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవడం లేదనేది బలంగా వినిపిస్తున్న ఆరోపణ.తమ భూములు కొన్ని చుక్కల భూములుగానూ,మరికొన్ని ఎసైన్డ్ భూములుగానూ మారిపోయాయని.....,రికార్డులు సరిచేసి తమకు సర్వ హక్కులు కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

ఇప్పటికైనా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి తమ సమస్యకు పరిష్కారం చూపాలని రైతులు కోరుతున్నారు.తమ భూములు వివాదంలో ఉండటం వల్ల క్రయవిక్రయాలు నిర్వహించలేకపోతున్నామని, రుణాలు, ప్రభుత్వ రాయితీలు వంటివి కూడా దక్కడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details