Lal Foundation provides meals: ప్రకాశం జిల్లా పొదిలిలో కరోనా సమయంలో అర్ధాకలితో ఉన్న పేదలకు భోజన సౌకర్యం కల్పిస్తూ దాతృత్వాన్ని చాటిచెప్పారు లాల్ ఫౌండేషన్ నిర్వాహకులు. సీనియర్ ఐఏఎస్ అధికారి ఎం.డి అరీద్ అహ్మద్, అతని సోదరులు వివిధ ప్రాంతాల్లో ఉన్నతోద్యోగాలు, వ్యాపారాల్లో స్థిరపడ్డారు. ఈ సోదరులు తమ తండ్రి, తాతలకు గుర్తుగా లాల్ ఫౌండేషన్ పేరుతో పొదిలిలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.
కరోనా సమయంలో ఆకలితో ఉన్నవారి పరిస్థితిని గమనించిన వీరు.. అప్పటి నుంచి ప్రతిరోజూ ఆహార పొట్లాలను తయారుచేసి పేదలకు పంపిణీ చేయడం ప్రారంభించారు. పొదిలి కూడలిలో మసీదు వద్ద కొంతమంది సేవకుల సహకారంతో భోజనాలు వండించి పేదలకు సరఫరా చేస్తున్నారు.
Lal Foundation provides meals: ఇప్పటివరకూ ఈ సంస్థ లక్ష మందికి భోజన ప్యాకెట్లు అందించింది. అంతేకాకుండా పేద విద్యార్థులకు ఫీజులు కట్టడం, వైద్య సహకారం అందించడం, మసీదు నిర్మాణాలకు విరాళాలు ఇవ్వడం లాంటివి లాల్ ఫౌండేషన్ ద్వారా అందిస్తున్నారు.