త్రిపురాంతకం ఆలయాల్లో వైశాఖ పౌర్ణమి పూజలు - వైశాఖ పౌర్ణమి
వైశాఖ పౌర్ణమిని పురస్కరించుకుని త్రిపురాంతకంలో ఆలయాలు భక్తులతో కిక్కిరిపోయాయి. పలు ఆలయాల్లో లక్ష బిల్వార్చన, లక్ష మల్లెలార్చన కార్యక్రమాల్ని నిర్వహించారు.
'త్రిపురాంతకం ఆలయాల్లో వైశాఖ పౌర్ణమి పూజలు'
వైశాఖ పౌర్ణమి సందర్బంగా ప్రకాశం జిల్లా త్రిపురాంతకం లోని ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పార్వతీ త్రిపురాంబ సమేత త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయంలో లక్ష బిల్వార్చన పూజ చేశారు. బాలా త్రిపుర సుందరి దేవి ఆలయం లో లక్ష మల్లెలార్చన పూజ కార్యక్రమాలని నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు అందుకున్నారు.