ప్రకాశం జిల్లాలో ఒంగోలులోని ట్రూనాట్ ల్యాబుల్లో పనిచేసే సాంకేతిక సిబ్బంది రిమ్స్ ఎదుట ఆందోళన చేపట్టారు. మూడు నెలలుగా నిర్విరామంగా ఉద్యోగాలు చేస్తున్నామని, ఆరోగ్యం పాడైన సెలవులు ఇవ్వడంలేదని, తమకు ప్రాణ భయం ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో కరోనా కేసులు సంఖ్య గణనీయంగా పెరుగుతుండటం వల్ల రోజుకు వేలాది మంది నమూనాలను పరీక్షలు చేయాల్సి రావడంతో తీవ్రమైన పని ఒత్తిడికి గురవుతున్నామని తెలిపారు.
ల్యాబ్ టెక్నీషియన్ల ఆందోళన.. రక్షణ ఏర్పాట్లు చేయాలని డిమాండ్ - carona stress to lab technicians'
లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి జిల్లాలోని ట్రూనాట్ ల్యాబుల్లో నిర్విరామంగా పని చేస్తున్న ఒంగోలు జీజీహెచ్ సిబ్బంది ఆందోళన చేపట్టారు. ల్యాబుల్లో తీవ్రమైన పని ఒత్తడి ఉందని, వారాంతపు సెలవులు, రక్షణ ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు.
ల్యాబ్ టెక్నీషియన్ల ఆందోళన.. రక్షణ ఏర్పాట్లు చేయాలని డిమాండ్
నమూనాలను పరీక్షిస్తున్న తమకు ఎలాంటి భద్రత లేకపోవటంతో ప్రాణభయంతో అల్లాడుతున్నామని వాపోయారు. ఒంగోలు రిమ్స్‌లో ఉన్న వీఆర్‌డీఎల్ ల్యాబ్‌తో పాటు, ట్రూనాట్ ల్యాబుల్లో తీవ్రమైన పని ఒత్తిడి ఉందని, వారాంతపు సెలవులు, రక్షణ ఏర్పాట్లు చేయాలని కోరారు.