రాష్ట్ర ఆర్యవైశ్య సంక్షేమ, అభివృద్ధి సంస్థ ఛైర్మన్గా కుప్పం ప్రసాద్ ప్రమాణస్వీకారం చేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమానికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఆర్యవైశ్యుల్లోని పేదలందరికీ కార్పొరేషన్ ద్వారా ఆర్థిక సాయం అందించి... వారి అభ్యున్నతికి కృషి చేస్తున్నట్టు మంత్రులు వివరించారు.
ఆర్యవైశ్య సంక్షేమ, అభివృద్ధి సంస్థ ఛైర్మన్గా కుప్పం ప్రసాద్ - ఆర్య వైశ్య సంక్షేమ,అభివృద్ది కార్పొరేషన్ ఛైర్మన్గా కుప్పం ప్రసాద్ ప్రమాణ స్వీకారం
ఆర్యవైశ్య సంక్షేమ, అభివృద్ధి సంస్థ ఛైర్మన్గా కుప్పం ప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. ముఖ్యమంత్రి జగన్ అప్పగించిన బాధ్యతను సమర్ధవంతంగా నిర్వహిస్తానని పేర్కొన్నారు. ఆర్యవైశ్య కుటుంబాల సంక్షేమానికి, అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని చెప్పారు.
![ఆర్యవైశ్య సంక్షేమ, అభివృద్ధి సంస్థ ఛైర్మన్గా కుప్పం ప్రసాద్ కుప్పం ప్రసాద్ ప్రమాణ స్వీకారం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6093116-885-6093116-1581851608892.jpg)
కుప్పం ప్రసాద్ ప్రమాణ స్వీకారం
ఆర్యవైశ్య సంక్షేమ, అభివృద్ధి సంస్థ ఛైర్మన్గా కుప్పం ప్రసాద్
TAGGED:
Kuppam Prasad sworn