ప్రకాశం జిల్లా ఉలవపాడులో.. 35 సంవత్సరాలుగా ఉన్న కృష్ణుని దేవాలయంలో విగ్రహాన్ని కొందరు నేతలు పగులకొట్టారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కొత్త విగ్రహం ఏర్పాటు చేసుకుంటున్న సమయంలో పోలీసులతో అక్కడికి వచ్చిన ఈవో.... దేవాలయాన్ని కూల్చివేశారని జిల్లా ఎస్పీ సిద్దార్ట్ కౌశల్‌కు ఫిర్యాదు చేశారు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన తమ భర్తలపై కేసులు పెట్టారన్నారు. కేసులు పెట్టినప్పటి నుంచి తమ భర్తలు కనిపించకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి రోజు ఇళ్లకు పోలీసులు వచ్చి మహిళలను ఇబ్బంది పెడుతున్నారని ఎస్పీకు వివరించారు.
'కృష్ణుడి దేవాలయం కూల్చేశారు... నిలదీస్తే కేసులు పెట్టారు' - ఉలవపాడులో కష్ణుని దేవాలయ వివాదం వార్తలు
ప్రకాశం జిల్లా ఉలవపాడులో కృష్ణుని దేవాలయాన్ని కూల్చివేసిన అధికారులు, నాయకులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానిక మహిళలు.. జిల్లా ఎస్పీ సిద్దార్ట్ కౌశల్ కు ఫిర్యాదు చేశారు. కేసుల పేరుతో హింసిస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
krishna-temple-issue-in-prakasam-ulavapadu