ప్రకాశం జిల్లా మార్కాపురంలో ముందస్తు శ్రీ కృష్ణాష్ఠమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వాసవీ, నారాయణ పాఠశాలలో వేడుకలు జరిగాయి. చిన్నారులు వేసిన వివిధ వేషాధారణలు..... నృత్యాలు ఆకట్టుకున్నాయి.
కర్నూల్లో ముందస్తు శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఆనందోత్సాహాలతో నిర్వహించారు. నగరంలోని భాష్యం స్కూల్లో విద్యార్థులు శ్రీకృష్ణుని వేషధారణలో అలరించారు. ఉట్టిని కొట్టేందుకు ఆసక్తి చూపారు.
ప్రకాశం జిల్లా చీరాలలో ప్రైడ్ ఇంటర్నేషనల్ పాఠశాలలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు కన్నుల పండువగా సాగాయి. చిన్నారులు శ్రీకృష్ణుని... గోపికల వేషధారణతో ఆకట్టుకున్నారు.
కృష్ణాష్ఠమి వేడుకలకు ప్రఖ్యాత ఇస్కాన్ అష్ఠ సఖీ సమేత రాధాగోవింద కమల మందిరం ముస్తాబైంది. వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తిరుపతి ఇస్కాన్ ఆలయ అధ్యక్షులు రేవతి రమణదాస్ తెలిపారు. 23న శ్రీకృష్ణాష్ఠమి, 24న ఇస్కాన్ జన్మాష్ఠమి, 25న వేద వ్యాసపూజ నిర్వహిస్తున్నట్లు వివరించారు. ప్రపంచవ్యాప్తంగా 700 మందిరాలలో ఇస్కాన్ జన్మాష్ఠమి వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు. స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని వెల్లడించారు.
విజయవాడలోని రాధాశ్యామసుందర మందిరంలో అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో జన్మాష్ఠమి వేడుకలు నిర్వహించనున్నారు.
కృష్ణుడి వేషాధారణలో ఆకట్టుకున్న చిన్నారులు ఇది చూడండి: నాగ్‌పూర్‌లో హైదరాబాద్ వారి 'శ్రీకృష్ణ రాయబారం'