కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. ప్రకాశం జిల్లా చీరాలలో అధికారులు అప్రమత్తమయ్యారు. పట్టణంలో అధికారులు ఆంక్షలు విధించారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరిచి ఉంచేందుకు అనుమతి ఇచ్చారు. నిబంధనల సమయాల్లో అనవసరంగా బయటకు వస్తే.. చర్యలు తప్పవని చీరాల ఒకటో పట్టణ సీఐ రాజమోహన్ తెలిపారు. దీంతో పట్టణంలోని దుకాణాలు మూతపడగా.. రహదారులు జనసంచారం లేక బోసిబోయాయి.
చీరాలలో కొవిడ్ ఆంక్షలు..బోసిపోయిన రహదారులు - Chirala latest news
చీరాల పట్టణంలో అధికారులు ఆంక్షలు విధించారు. కొవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా..పట్టణంలో ఉదయం 6గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరిచేందుకు అనుమతినిచ్చారు.
![చీరాలలో కొవిడ్ ఆంక్షలు..బోసిపోయిన రహదారులు Kovid sanctions in Chirala](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10:00:03:1619584203-ap-ong-41-27-chirala-covid-ankshalu-av-ap10068-27042021155214-2704f-1619518934-465.jpg)
Kovid sanctions in Chirala