ప్రవీణ్ కుమార్, ప్రశాంతి కుమారి దంపతులకు ముగ్గురు సంతానం. స్వస్థలం ప్రకాశం జిల్లా చీరాల మండలం సిపాయిపేట. ఈ దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు. చిన్నతనం నుండే మంచి వారికి బుద్ధులను నేర్పించారు. ఎదుటివారికి సాయం చేసే గుణం కలిగించారు. దీంతో ఆముగ్గురు చిన్నారులు చిరు ప్రాయంలోనే...తమ జుట్టును కేన్సర్ బాధితుల కోసం దానం చేశారు. ఈ ముగ్గురిలో గ్రేస్ ఎంజల్ 4 వ తరగతి, లూడ్స్ ఎంజల్ రెండో తరగతి, జొస్ క్రిస్ట్ ఎంజల్ ఒకటో తరగతి చదువుతున్నారు.
ఈ చిన్నారులు ఓ స్వచ్ఛంద సంస్థ ఇచ్చిన పిలుపుతో స్పందించారు. కేన్సర్ భాదితులకు మనోధైర్యం నింపేందుకు తమ కురులను దానం చేశారు. ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వచ్చిన హెయిర్ డొనేషన్ కార్యక్రమాలను చూశారు. ప్రేరణ పొంది హైదరాబాద్ హెయిర్ డొనేషన్ ఆఫ్ కేన్సర్ ఆర్గనైజేషన్ వారిని సంప్రదించారు. ఆ సంస్థ ప్రతినిధులు చీరాలకు వచ్చి ముగ్గురు బాలికల తల వెంట్రుకలను తీసుకెళ్లారు.