ఒంగోలులో హోరెత్తిస్తోన్న ఖోఖో పోటీలు - kho kho competitions in ongole of prakasam district
ప్రకాశం జిల్లా ఒంగోలులో రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న బాల బాలికల అంతర్ జిల్లాల ఖోఖో పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో జరుగుతున్న ఈ పోటీలు నగరవాసులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. రెండో రోజు బాలికల విభాగంలో కడప, విజయనగరం జట్లు మధ్య జరిగిన పోరులో నువ్వా నేనా అంటూ పాయింట్లు కోసం ప్రయత్నించారు. బాలుర విభాగంలో విశాఖపట్నం, పశ్చిమగోదావరి మధ్య జరిగిన పోటీ అందరినీ ఆద్యంతం అలరించింది.
ఒంగోలులో హోరెత్తిస్తోన్న ఖోఖో పోటీలు