ప్రకాశం జిల్లా చీరాల మండలం వాడరేవు తీరంలో దోనిదేవుడు అనే మత్స్యకారుడి వలకు మంగళవారం 28 కిలోల కచ్చిలి చేప చిక్కింది. దీనిని కొనుగోలు చేసేందుకు పలువురు పోటీ పడ్డారు. చివరకు అదే ప్రాంతానికి చెందిన దారకొండ అనే వ్యాపారి రూ.1.70 లక్షలకు దక్కించుకున్నారు. ఈ చేప పొట్ట భాగాన్ని మందుల తయారీలో వినియోగిస్తారని, అందుకే ఇంత గిరాకీ అని మత్స్యకారులు తెలిపారు.
ఈ కచ్చిలి చేప ఖరీదు .. రూ. 1.70 లక్షలు - ప్రకాశం జిల్లాలో కచ్చిలి చేప
28కిలోల కచ్చిలి చేప మత్స్యకారుడి వలలో పడింది. దీనిని కొనేందుకు పలువురు పోటీ పడ్డారు. చివరకు ఓ వ్యాపారి దీనిని 1.70 లక్షల రూపాయలకు కొనుగోలు చేశాడు.
KHARIDAINA FISH